‘నారావారిపల్లె’లో చంద్రబాబు తల్లిదండ్రుల సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన

శుక్రవారం ఏపీ అసెంబ్లీ లో చంద్రబాబు , ఆయన భార్య భువనేశ్వరిలఫై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలఫై దేశ వ్యాప్తంగా చర్చ కు దారి తీసింది. తెలుగుదేశం నేతలు , కార్యకర్తలే కాదు సామాన్య ప్రజలు సైతం వైసీపీ నేతల ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ మీడియా ముందుకు వచ్చి మరోసారి రిపీట్ అయితే బాగొదంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కంటతడిపై నారా రోహిత్‌ ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద నారా రోహిత్ నిరసన తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ వైసిపి ముష్కరమూకలు చేసిన మానసిక దాడికి నిరసనగా రోహిత్ తమ పూర్వీకుల సమాధుల వద్ద నివాళులర్పించి బైఠాయించారు. తమ పెదనాన్న చంద్రబాబునాయుడు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారు.

అన్న ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో చేసుకోలేదు…గడప దాటలేదు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదని వాపోయారు. మ‌రోసారి ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే స‌హించేది లేద‌న్నారు. రాజ‌కీయాల కోసం వ్య‌క్తిత్వ హ‌న‌నం దారుణం అని తెలిపారు.