ధమాకా ఫస్ట్ డే కలెక్షన్స్

మాస్ రాజా రవితేజ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ధమాకా మూవీ గ్రాండ్ గా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించారు. కాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ధమాకా ..ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైంది. పాతకథనే..మళ్లీ చూపించారు తప్ప..కొత్త కథ – కథనం లేదని ప్రేక్షకులు అంటున్నారు.

ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 670 థియేటర్లలో విడుదల చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 940 కి పైగానే ఉంటుంది. ఇక సినిమా బిజినెస్ విషయానికి వస్తే..ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 19 కోట్లు షేర్ కలెక్షన్స్ అందుకుంటేనే సక్సెస్ అయినట్లు. ఇక ఫస్ట్ డే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు కూడా ఇదే తరహాలో కలెక్షన్స్ పెరిగితే ఈజీగా ప్రాఫిట్ జాన్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి టాక్ నెగిటివ్ గా రావడం తో కలెక్షన్లు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.