టాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం..

టాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం..

తెలుగు చిత్రసీమలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. మొన్నటి వరకు కరోనా మరణాలే అనుకుంటే ఇప్పుడు వరుస ఆత్మహత్య లు ఇండస్ట్రీ లో కలవరం రేపుతున్నాయి. రీసెంట్ గా పలువురు జూనియర్ ఆర్టిస్టులు ఆత్మ హత్య చేసుకోగా..తాజాగా సైద్‌ రహీమ్‌ అనే 24 సంవత్సరాల యువకుడు జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మ హత్య చేసుకున్నాడు.

చాంద్రాయణ గుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధి లో ఈ ఘటన చోటు చేసుకుంది. సైద్‌ రహీమ్‌ జూనియర్ ఆర్టిస్ట్‌ గా పని చేస్తున్నాడు. పలు సినిమాల్లో నటించిన సైద్‌ తాజాగా సుసైడ్‌ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం తో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు మొదలుపెడుతున్నారు.