బిజెపి నేతకు ఎన్నికల సంఘం నోటీసులు

ఢిల్లీలో ఆ ప్రాంతం మినీ పాకిస్థాన్‌గా మరిందని కపిల్‌ మిశ్రా వివాదస్పద వ్యాఖ్యలు

Kapil Mishra
Kapil Mishra

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8న ఢిల్లీ వీధుల్లో భారత్‌-పాకిస్థాన్‌ ఢీ కొంటున్నాయి అంటూ బిజెపి నేత కపిల్‌ మిశ్రా నిన్న వివాదస్పద ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా కపిల్‌ మిశ్రా చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీ ఎన్నికల సంఘం ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై పూర్తి నివేదికను తమకు అందజేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ ఎన్నికల అధికారిని ఆదేశించింది. కాగా కపిల్‌ మిశ్రా మరో ట్వీట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన పౌరచట్టానికి వ్యతిరేకంగా షెహన్‌బాగ్‌ ప్రాంతంలో ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ దాన్ని మినీ పాకిస్థాన్‌గా అభివర్ణించారు. పాక్‌ షెహన్‌బాగ్‌లో అడుపెట్టింది. ఢిల్లీలో ఆ ప్రాంతం మినీ పాకిస్థాన్‌గా మారిందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢీల్లీని పాక్‌తో పోల్చినందుకు గాను ఆయన నామినేషన్‌ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/