బయటకు వచ్చారో… ఇక క్వారంటైన్‌కే

గుంటురు జిల్లాలో కఠిన నిబంధనలు

strict rules in guntur
strict rules in guntur

గుంటూరు: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. హట్‌స్పాట్‌లు ఉన్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రాకుండా ఆంక్షలు విదించారు. ఇప్పటికే జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. సోమవారం కూడా మరో 23 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలలో నిబంధనలను కఠినతరం చేశారు. అనవసరంగా బయటకు వచ్చిన వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 237 కరోనా కేసులు నమోదు కాగా, 29 మంది డిశ్చార్చి అయ్యారు. మరో 8 మంది మృతి చెందారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/