పవన్‌ కళ్యాణ్‌కు మళ్లీ షాకిచ్చిన రాపాక

మూడు రాజధానుల ఏర్పాటు సరైనదే

Rapaka Vara Prasada Rao
Rapaka Vara Prasada

అమరావతి: జనసేన ఏకైక ఎమ్మేల్యే రాపాక వరప్రసాద్‌ మరోసారి పవన్‌ కళ్యాణ్‌కు షాక్‌ ఇచ్చారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాపాక రాజధానికి సంబంధించిన పరిణామాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు సరైనదే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని అన్నారు. విభజన తర్వాత ఏపీ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉందన్నారు. ప్రజలకు మేలు జరుగుతుందంటే జనసేన మద్దతు ఇస్తుందన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని రాపాక చెప్పారు. గతంలో టిడిపి ప్రభుత్వం బలవంతంగా రైతుల దగ్గర భూములు లాక్కున్నారని అందువల్ల రాజధాని రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందేనని అమరావతి రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాపాక డిమాండ్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/