రేపు గోవిందదామంలో డాలర్ శేషాద్రి అంత్యక్రియలు

డాల్లర్ శేషాద్రి అంత్యక్రియలను రేపు తిరుపతి గోవింద దామంలో జరుగనున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దివదేహాన్ని తీసుకురానున్నారు. ఇవాళ అర్దరాత్రికి తిరుపతికి ఆయన పార్దివదేహం చేరుకోనుంది. రేపు ఉదయం ప్రజల సందర్శనార్దం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్ లో పార్దీవదేహన్ని ఉంచుతారు. రేపు మధ్యహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు నిర్వహించిన అనంతరం…తిరుపతి గోవిందదామంలో అంతిమ సంస్కారాలు జరపడానికి నిర్ణయం తీసుకున్నారు.

ఈరోజు ఉదయం గుండెపోటుతో శేషాద్రి మరణించారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖ వెళ్లారు. కాగా.. వేకువజామున గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగింది. కాగా డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.