చంద్ర‌యాణ్‌-3 ప్ర‌తిమ‌తో శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు

isro-team-visits-tirupathi-temple-with-miniature-model-of-chandrayaan-3

తిరుపతి : తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌ 3 సూక్ష్మ నమూనాతో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. రేపు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.

కాగా, చంద్ర‌యాన్‌-3 మిష‌న్‌ను శుక్ర‌వారం ఇస్రో చేప‌ట్ట‌నున్న విష‌యం తెలిసిందే. రేపు మ‌ధ్యాహ్నం 2.35 నిమిషాల‌కు రాకెట్ ద్వారా చంద్ర‌యాన్‌-3ను ప్ర‌యోగించ‌నున్నారు. అయితే ఆ ప్ర‌యోగం స‌క్సెస్ కావాల‌ని కోరుతూ ఈరోజు ఉద‌యం ఇస్రో చీఫ్ ఎస్‌. సోమ‌నాథ్‌.. తిరుమ‌ల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆగ‌స్టు 23వ తేదీన చంద్ర‌యాన్‌-3 రోవ‌ర్‌.. చంద్రుడిపై దిగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల బృందం నేడు తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి ద‌ర్శ‌నం చేసుకున్నారు. చంద్ర‌యాణ్‌-3 ప్ర‌తిమ‌తో శాస్త్ర‌వేత్త‌లు ఆల‌యాన్ని విజిట్ చేశారు. శ్రీహ‌రికోట‌లోని స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ నుంచి చంద్ర‌యాన్‌-3ను ప్ర‌యోగించ‌నున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ఈ మిష‌న్ చేప‌ట్ట‌నున్నారు. రేప‌టి ప్ర‌యోగం కోసం మ‌రికాసేప‌ట్లో కౌంట్‌డౌన్ ప్రారంభంకానున్న‌ది.