కోవిడ్‌-19 ఎఫెక్టుతో ట్విట్టర్‌ కీలక ఆదేశాలు

twitter-encourages-all-5k-employees-work-home
twitter-encourages-all-5k-employees-work-home

శ్రాన్‌ఫ్రాన్సిస్కో: కోవిడ్‌-19 కొత్త భూభాగాల్లో కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం అయిన ట్విట్టర్‌ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్విట్టర్‌లో పనిచేసే మొత్తం 5వేల మంది ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి హాంకాంగ్‌, జపాన్‌, దక్షిణ కొరియా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు మాండేటరీ ఆదేశాలు జారీ చేసింది. అనవసర ప్రయాణాలపై ఇప్పటికే ఆంక్షలు విధించి మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ ఫాం తాజా నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ -19 విస్తరణకు అడ్డుకట్ట వేసే యోచనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ ఇంటి నుంచే పనిచేసేందుకు ప్రోత్సహిస్తున్నామని ట్విట్టర్‌ ప్రకటించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/