గ్రామీణ మహిళల వేదన తీర్చడం ఎలా?

చట్టాలపై అవగాహన అవసరం

International Rural Women's Day
International Rural Women’s Day

ప్రపంచమంతా ఆధునికత, సాంకేతికత చుట్టూ పరిభ్రమిస్తోంది. కాని మనిషి కనీస అవసరమైన ఆహార భద్రత ఇప్పటికీ గ్రామాల నుండే జరుగుతోంది. అందునా మహిళల శ్రమ లేకుండా ఏ ఉత్పత్తి వ్యవస్థ సమగ్రంగా పనిచేయట్లేదు.

క్షేత్రస్థాయిలో మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ పరిశ్రమ అయినా మనుగడ సాధించడం అసాధ్యం అని సమాజం, పాలకులు గుర్తించాలి. వారి శ్రమను గుర్తించాలి.

వారికి భూమిపై హక్కులు కల్పించాలి. నిర్ణయాధికారంలో వారిని భాగస్వాములను చేయాలి. మొత్తంగా వారి హక్కులను కాపాడాలి.

నేటి సమాజంలో మహిళా స్థితిగతులు, వారి పనితీరు,వారి హక్కులు, అమలవు తున్న చట్టాలపై సమాజానికి ప్రభుత్వానికి ఒక అవగాహన అవసరం.

గ్రా మీణ ఆర్థిక వ్యవస్థకు మహిళలే వెన్నెముకగా ఉన్నారు.

ఐక్యరాజ్యసమితి అక్టోబరు 15వ తేదీని ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. మహి ళలు పనిచేయనిదే దేశానికి తిండి ఉండదని ప్రతి ఒక్కరు తెలుసు కోవాలన్నదే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం.

మహిళా రైతులు అంటే వ్యవసాయంలో నిమగ్నమై ఉన్న చిన్న, సన్నకారు మహిళా రైతులు, మహిళా వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, పశువు లను పెంచేవాళ్లు, సంచార పశు పెంపకదారులు, వ్యవసాయానికి తోటలను పెంచే కూలీలు, తోటలను పెంచేవారు, తేనెటీగలను పెంచేవారు, మత్స్యకారులు, అనుబంధంగా సాగే పట్టుపురుగుల పెంపకం, వానపాముల పెంపకం వంటివి చేసేవారు.

ఉప్పు కాంటారులలో పనిచేసేవారు, చిన్నతరహా కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరించి పోడు వ్యవసాయం సాగించే మహిళలు, అమ్మే ఆదివాసీ కుటుంబాల మహిళలు, ప్రత్యేకించి దళిత, నిర్వాసితులు, ఒంటరి మహిళలు, ఆదివాసీ, వికలాంగులు, వీరందరూ గ్రామీణ మహిళా రైతులే.

గ్రామీణ ఉత్పత్తిలో ప్రధా నంగా పాలుపంచుకుంటున్నది దళిత, బహుజన, ఆదివాసీ మహిళలే.

ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో సగానికి పైగా ఈ చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు, భూమిలేని కుటుం బాల భూమిలేని కుటుంబాల మహిళలే ఉత్పత్తి చేస్తున్నారు.

వ్యసాయంలో 70 శాతం పైగా పనులు చేస్తున్నప్పటికీ మహిళలకు భూమి హక్కులు లేవ్ఞ. గ్రామీణ మహిళలకు విద్య, పోషకాహా రం, వైద్యసదుపాయాలు సరైన విధంగా అందుబాటులో లేవు.

పైగా వారిపై పనిచేసే స్థలాల్లోను, కుటుంబంలోను రక్షణ లేకపో వడమే కాకుండా హింస, లైంగిక దోపిడీదాడులు జరుగుతున్నాయి.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాల కారణంగా సెజ్‌లు, పారిశ్రామిక కారిడార్లకు భూములను కేటాయించడం వల్ల గ్రామాలలో పేద ప్రజలు తమ భూముల నుండి నిర్వాసితులవు తున్నారు.

ఆదివాసీ ప్రాంతాలలో గనుల తవ్వకం, ప్లాంటేషన్లు, పంటల మార్పిడి, ఆదివాసేతరుల దోపిడీ వల్ల ప్రజలు వలసపో తున్నారు.

కొత్త ప్రాంతాలలో జీవనోపాధి లేక సరైన తిండి దొరకక తప్పని పరిస్థితులలో మహిళలు వ్యభిచారంలోకి నెట్టి వేయబడుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల నుండి వలసపోయిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలు ఫ్యాక్టరీలలో పెద్దపెద్ద మాల్‌లో విపరీతమైన శ్రమదోపిడీకి హింసకు గురువు తున్నారు.

ఒక కుటుంబంలో మహిళకు సాధికారత లభిస్తే మొత్తం కుటుంబ మంతా బాగుపడుతుంది.

సమాజంలో పాతుకుపోయిన పితృస్వామిక విలువల కారణంగా అవి మహిళలకు లభించే విధంగా అమలు జరగడం లేదు

. అడుగడుగునా వివక్ష నెలకొన్న సమాజంలో భద్రత లేని పరిస్థితులలో బతుకులు వెళ్లదీస్తున్న మహిళా లోకం ఆహార ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం సందర్భంగా అక్టోబరు 15వ తేదీన గ్రామీణ మహిళల హక్కుల పరిరక్షణకై మానవ హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక శక్తులు ఎలుగెత్తి చాటాలి.

వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత వృత్తులే ప్రధాన జీవనాధారంగా పనిచేస్తున్న ఈ గ్రామీణ జనాభా ప్రపంచానికి ఆహార భద్రత కల్పిస్తోంది. వీరిలో సగభాగంగా ఉన్న మహిళలు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రపంచమంతా ఆధునికత, సాంకేతికత చుట్టూ పరిభ్రమిస్తోంది. కాని మనిషి కనీస అవసరమైన ఆహార భద్రత ఇప్పటికీ గ్రామాల నుండే జరుగుతోంది.

అందునా మహిళల శ్రమ లేకుండా ఏ ఉత్పత్తి వ్యవస్థ సమగ్రంగా పనిచేయట్లేదు. క్షేత్రస్థాయిలో మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ పరిశ్రమ అయినా మనుగడ సాధిం చడం అసాధ్యం అని సమాజం, పాలకులు గుర్తించాలి. వారి శ్రమను గుర్తించాలి.

వారికి భూమిపై హక్కులు కల్పించాలి. నిర్ణయాధికారంలో వారిని భాగస్వాములనుచేయాలి. మొత్తంగా వారి హక్కులను కాపాడాలి.

నేటి సమాజంలో మహిళా స్థితి గతులు, వారి పనితీరు,వారి హక్కులు, అమలవుతున్న చట్టాలపై సమాజానికి ప్రభుత్వానికి ఒక అవగాహన అవసరం.

  • కాళంరాజు వేణుగోపాల్‌

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/