వడ్డీ రేట్లు 1.75% తగ్గించొచ్చు :ఆర్‌బీఐ

interest-rates-reduced
interest-rates-reduced

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ వచ్చే ఆర్థిక సంవత్సర (2020-21) రెపో రేటును 1.75 శాతం వరకు తగ్గించవచ్చని ఫిచ్‌ అంచనా వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొనడం,. కరోనా మూలంగా మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం కావడం వంటి పరిణామాలను దీటుగా ఎదుర్కొనే విధంగా ఆర్‌బీఐ ఈ చర్య తీసుకోవచ్చునని పేర్కొం ది. అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ రేట్లను తగ్గిస్తే రెపో రేటు 3.40 శాతానికి, రివర్స్‌ రెపో రేటు 3 శాతానికి చేరుకోనుంది. ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 4.75 శాతంగా ఉంది. 202021లో భారత వాస్తవ జీడీపీలో వృద్ధి 5.4 శాతం ఉండవచ్చని తెలిపింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/