ఆఖరికి ప్రభాస్ ఫ్రెండ్స్ థియేటర్ కూడా మూతపడింది ..

ఏపీలో వరుసగా సినిమా థియేటర్స్ మూతపడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలు పాటించని కారణంగా అధికారులు ఓ పక్క థియేటర్స్ ను సీజ్ చేస్తుంటే..ప్రభుత్వం తెలిపిన ధరలకు సినిమా థియేటర్స్ నడపలేమని స్వచ్ఛదంగా థియేటర్స్ యజమానులు తమ థియేటర్స్ ను మూతవేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో థియేటర్స్ మూతపడగా..ఈరోజు శనివారం యూవీ క్రియేషన్స్ నిర్మాతల వి-ఎపిక్ వి-ఎపిక్ అనే మల్టీప్లెక్స్ థియేటర్​ను.. యాజమాన్యం ఇవాళ మూసివేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వి-ఎపిక్ మల్టీప్లెక్స్ థియేటర్​ను​ యాజమాన్యం మూసివేసింది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడంతో.. అ ధరలు తమకు గిట్టుబాటు కావంటూ థియేటర్​ను మూసివేశారు. ఈ థియేటర్ ఆసియా ఖండంలోనే అతి పెద్ద స్క్రీన్ కలిగినది కావడం గమనార్హం. ఈ థియేటర్లోని స్క్రీన్ 100 అడుగుల పొడవు.. 50 అడుగుల వెడల్పుతో ఉంటుంది. 2019 ఆగస్టు 30న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ థియేటర్ ను ప్రారంభించారు. ఈ థియేటర్ ప్రాంగణంలో మరో రెండు సినిమా హాళ్లుకూడా ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన సినిమా టికెట్ల ధరలు అత్యల్పంగా ఉన్నాయంటూ వీటిని మూసేశారు.