సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన న్యూజిలాండ్ ఎంపీ!

ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ గౌరవ్ శర్మ

సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన న్యూజిలాండ్ ఎంపీ!
new-zealand-mp-gourav-take-his-oath-in-sanskrit

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన భారత సంతతి యువకుడు డాక్టర్ గౌరవ్ శర్మ, పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారాన్ని సంస్కృతంలో చేశారు. ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆయన, లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. న్యూజిలాండ్ పార్లమెంట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలుత స్థానిక భాషైన మౌరిలో, ఆపై సంస్కృతంలో గౌరవ్ ప్రమాణం చేశారని ఆ దేశంలోని భారత దౌత్యాధికారి ముక్తేశ్ పర్దేశి వెల్లడించారు. రెండు దేశాల సంస్కృతులను గౌరవించేలా గౌరవ్ నడచుకున్నారని అన్నారు.

కాగా, తన ఎంబీబీఎస్ విద్యను ఆక్లాండ్ లో, ఎంబీఏను వాషింగ్టన్ లో పూర్తి చేసిన గౌరవ్ శర్మ, ప్రమాణ స్వీకారం తరువాత మీడియాతో మాట్లాడారు. హిందీలో ప్రమాణం చేయడంతో పోలిస్తే, సంస్కృతంలో ప్రమాణం చేస్తే, అన్ని భారతీయ భాషలకూ గౌరవం దక్కుతుందని తాను భావించానని అన్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వంలో మరో భారత సంతతి నేత ప్రియాంక రాధాకృష్ణన్ ఇటీవలే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి విదితమే.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/