ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేష‌న్ ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం

ఈ నెల 24లోగా మూడు నోటిఫికేష‌న్లు జారీ
రేపు నేవీ, 24న‌ ఎయిర్‌ఫోర్స్‌ నోటిఫికేష‌న్లు

హైదరాబాద్: అగ్నిప‌థ్ ప‌థ‌కంపై కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం కీల‌క అడుగు వేసింది. ఆర్మీ విభాగంలో ఈ ప‌థ‌కం కింద అగ్నివీర్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అంతేకాకుండా నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ తేదీల‌ను కూడా ప్ర‌క‌టించేసింది. వెర‌సి అగ్నిప‌థ్ ప‌థ‌కంపై ఓ వైపు నిర‌స‌న‌లు మిన్నంటుతున్నా… కేంద్రం మాత్రం ఈ ప‌థ‌కం కింద నియామ‌కాల‌కు కీల‌క‌ ముంద‌డుగు వేసింది.

భార‌త సైన్యంలోని నావికా ద‌ళంలో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం మంగ‌ళ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదే స‌మ‌యంలో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్‌ల భ‌ర్తీ కోసం ఈ నెల 24న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. వెర‌సి అగ్నిప‌థ్ ప‌థ‌కం కింద అగ్నివీర్‌ల నియామ‌కాల ప్ర‌క్రియ‌ను కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం నుంచే ప్రారంభించిన‌ట్టైంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/