కెల్‌ రాహుల్‌కి మూడు ఫార్మాట్‌లలో అవకాశం ఇవ్వాలి

భారత మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌ దాస్‌ గుప్త అభిప్రాయం

kl rahul
kl rahul

ముంబయి: టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ క్వాలిటి బ్యాట్స్‌మన్‌ అని భారత మాజీ వికెట్‌ కీపర్‌ దీప్‌దాస్‌ గుప్త అన్నాడు. తాజాగా దీప్‌ దాస్‌ గుప్త ఇండియాటుడే ఇన్‌తో మాట్లాడుతు.. కెఎల్‌ రాహుల్‌ కి మూడు ఫార్మాట్‌లలో అవకాశం ఇవ్వాలని, అతను నాణ్యమైన బ్యాట్స్‌మన్‌ మరియు మంచి వికెట్‌ కీపర్‌ కూడా అని అన్నారు. ఏడాది వ్యవధిలోనే రెండు టీ20 ప్రపంచకప్‌లు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌కి టీ20 ఫార్మాట్‌లో రెగ్యులర్‌గా ఛాన్స్‌ ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కోరుతున్నా అని అన్నాడు. రాహుల్‌ వన్డే మరియు టెస్ట్‌లలో కూడా నిలకడగా రాణిస్తున్నాడు అని పేర్కోన్నాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/