ఆర్ధికంగా నష్టపోతాం.. ఐపీఎల్‌ ఆగిపోతే

కరోనా ప్రభావంపై ఆసిస్‌ కెప్టెన్‌ స్పందన

aaron finch
aaron finch

మెల్‌బోర్న్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అన్ని క్రీడా టోర్నీలు వాయిదా పడుతున్నాయి. అందులో ఇండియాలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఐపీఎల్‌ కూడా వాయిదా పడడం తెలిసిందే. వైరస్‌ కారణంగా ఐపిఎల్‌ నిలిచిపోతే తమకు ఆర్ధిక నష్టం భారీగా వాటిల్లే ప్రమాదముందని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడేందుకు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌’ ఇచ్చినందున ఇపుడు వాటిని పున:సమీక్షీస్తామని చెప్పింది. ఇపుడు ఆస్ట్రేలియా విదేశి ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో.. ఒకవేళ ఐపిఎల్‌ ఏప్రిల్‌ 15న ప్రారంభం అయినట్లయితే ఆసీస్‌ ఆటగాళ్లు ఆడేది సందేహంగా మారింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులో ఆటగాళ్ల ఆదాయం వాటాల పద్దతిలో ఉండడం వల్ల బోర్డు నష్టపోతే ఆటగాళ్లు కూడా నష్టపోతారు. కాని త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదెప్పుడు జరుగుతుందో చెప్పలేనని, మరో రెండు మూడు వారాలలో మార్పు రావచ్చని అన్నారు. అంతవరకు ప్రజలు క్షేమంగా ఉండాలని, తమ వంతుగా వైరస్‌ కట్టడికి తోడ్పడాలని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/