టి20 వరల్డ్ కప్ పై నిర్ణయం వాయిదా

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ వెల్లడి

T20 world cup
T20 world cup

ఆస్ట్రేలియాలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌పై నిర్ణయాన్ని ఐసీసీ వాయిదా వేసింది. టీ20 వరల్డ్‌కప్‌పై తమ నిర్ణయాన్ని వచ్చేనెలకు వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ తెలిపింది.

పన్ను మినహాయింపులు పొందటానికి బీసీసీఐకి మరో ఆరునెలల సమయం కూడా ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బోర్డు మూడు గంటలపాటు సమావేశమైంది.

అయితే అవుట్‌గోయింగ్‌ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ తన వారసుడికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియపై ఏమీ తెలపలేదు.

మరోవైపు ఈ-మెయిల్స్‌ లీక్‌పై దర్యాప్తు కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. 2016లో భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ దీర్ఘకాలిక పన్ను మినహాయింపు గడువు పొడిగింపు లభించడం బీసీసీఐ చీఫ్‌ గంగూలీకి ఊరనిచ్చే అంశం.

బీసీసీఐ, ఐసీసీ మధ్య చర్చల్లో పురోగతి కనిపించింది. కాగా అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ ఎటువంటి నిర్ణయంతీసుకోకపోవడంతో అనిశ్చితి కొనసాగుతోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/