వైయస్‌ఆర్‌ జిల్లాలో దారుణం..మైనర్ బాలిక ఫై పదిమంది అత్యాచారం

10 boys allegedly rape minor girl in YSR dist

ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారాలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు , చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా వైయస్‌ఆర్‌ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలిక ఫై పది మంది అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైరల్ గా మారింది.

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో ఎస్సీ బాలికపై గత కొంతకాలంగా ఓ యువకుడు, అతని స్నేహితులతో కలిసి మొత్తం 10 మంది పదే పదే అఘాయిత్యానికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం తెలిసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో డీఎస్పీ ఈ ఘటన ఫై స్పందించారు. బాలికపై అత్యాచార ఘటన మా దృష్టికి వచ్చింది. విచారణకు ఆదేశించాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరినీ ఉపేక్షించం. త్వరలోనే కొలిక్కి వస్తుంది అని తెలిపారు.