రూ.100 కోట్లు ఇచ్చిన అలాంటి పాత్రలు చేయను – శ్రీలీల

ఇటీవల హీరోయిన్లు డబ్బు కోసం ఎలాంటి పాత్రకైనా ఓకే చెపుతున్నారు. ముఖ్యంగా బోల్డ్ సీన్లకు ఏమాత్రం మొహమాట పడకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ ధమాకా ఫేమ్ శ్రీలీల మాత్రం వంద కోట్లు ఇచ్చిన అలాంటి పాత్రలు చేయనని తేల్చి చెప్పిందట.

పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ..ప్రస్తుతం ఇండస్ట్రీ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. ధమాకా చిత్రం అమ్మడి జతకన్నే మార్చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలతో అమ్మడు బిజీ గా ఉంది. ఆ సినిమాలన్నీ కూడా చిన్న చితక సినిమాలు కాదు మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ వంటి అగ్ర హీరోల చిత్రాలే. ఈ తరుణంలో ఓ స్టార్ డైరెక్టర్ శ్రీ లీలా చేత కూడా బోల్డ్ క్యారెక్టర్ లో నటింప చేయాలనీ అనుకున్నాడట. అందులో భాగంగానే తాను తెరకెక్కించబోయే ఒక కొత్త ప్రాజెక్టులో ఈమెకు అవకాశం కల్పించినట్లు సమాచారం. అంతేకాదు పది కోట్ల రూపాయల వరకు పారితోషకం ఇస్తానని ఆఫర్ కూడా చేశారట.

కానీ శ్రీ లీలా మాత్రం ఈ విషయానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది.. రూ.100 కోట్లు ఇచ్చినా సరే అలాంటి పాత్రలు చేయను అని ఒకవేళ అలాంటి పాత్రలు చేసే సమయం వస్తే కచ్చితంగా సినిమాల నుంచి తప్పుకుంటానని చెప్పిందట ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం బయటకు వచ్చేసరికి ఆమె అభిమానులు శభాష్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.