పెదవిపై నలుపు పోవాలంటే..

Black on the lip

కొందరికి హార్మోన్లలో మార్పుల వల్ల పై పెదవి మీద వెంట్రుకలు వస్తుం టాయి. లేదంటే పెదవి పై చర్మం నలుపుగా అవ్ఞతుంటుంది. ఇందుకు పరిష్కారంగా థ్రెడింగ్‌, వ్యాక్సింగ్‌ వంటివి మేలైన పద్ధతులు. వీటితోపాటు చర్మం నలుపుతనం తగ్గి సాధారణ రంగులోకి రావాలంటే టమోటా గుజ్జు రాసి, ఆరిన తరువాత కడిగేసుకోవాలి. టమోటా సహజ సిద్ధమైన బ్లీచ్‌లాగ పనిచేస్తుంది. అవాంఛిత రోమాలను, నలుపును తగ్గిస్తుంది. టీ స్పూన్‌ తేనెలో అర టీస్పూన్‌ నిమ్మరసం కలిపి రాయాలి. పదిహేను నిమిషాలు ఉంచి, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పసుపు, పాలు కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని పెదవిపై నలుపుగా ఉన్న ప్రాంతంలో రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. కార్న్‌ఫ్లోర్‌, గుడ్డులోని తెల్లసొన, పంచదార కలిపి కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రాసి, ఆరిన తరువాత కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పై పెదవి మీద వచ్చే నలుపు, అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/