ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు

రేష‌న్ వాహ‌నాల రంగులపై మార్చి 15న త‌దుప‌రి విచార‌ణ‌

అమరావతి: ఏపిలో షన్ డోర్ డెలివ‌రీ వాహనాల రంగులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలుపుతూ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వాటిని వాడొద్దంటూ జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు తాజాగా స్టే విధించింది. ఎస్ఈసీ ఆదేశాల‌ను స‌వాలు చేస్తూ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ వేసిన ఈ పిటిష‌న్‌పై ఈ రోజు హైకోర్టు విచార‌ణ జ‌రిపి, ఏపీ ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌పై స్టే విధించింది. రేష‌న్ వాహ‌నాల రంగుల అంశంపై మార్చి 15న త‌దుప‌రి విచార‌ణ జ‌రుపుతామ‌ని చెప్పింది.

కాగా, రేష‌న్ వాహ‌నాలపై వైఎస్‌ఆర్‌సిపి రంగులు ఉన్నాయని ఎస్‌ఈసీ ఇటీవ‌ల‌ అభిప్రాయపడిన విష‌యం తెలిసిందే. పార్టీలకు సంబంధం లేకుండా ఉండే రంగులు వేయాల‌ని ఇటీవ‌ల ఎస్ఈసీ సంబంధిత‌ అధికారుల‌కు సూచించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/