మొక్కలు నాటిన హీరో శర్వానంద్

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మూడో విడత కార్యక్రమం

Sharwanand accepted the Green India Challenge
Sharwanand accepted the Green India Challenge

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది.

రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వ‌చ్ఛందంగా స్వీకరించి బంజారాహిల్స్ లోని తన ఇంటి పక్కన పార్క్ లో రాజ్యసభ సభ్యులు సంతోష్ , జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి హీరో శర్వానంద్ మొక్క‌లు నాటారు. 

ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ, “సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాను.

రోజు రోజుకు మారుతున్న వాతావరణం, పెరుగుతున్న కాలుష్యంతో మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే మనందరం మొక్కలు నాటాలి.

వాటిని సంర‌క్షించాలి. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలి” అని పిలుపునిచ్చారు. 

అదేవిధంగా త‌మ‌ ఇంటి పక్కన ఉన్న జిహెచ్ఎంసి పార్కులో యాదాద్రి విధానంలో  మొక్కలు పెంచే ఏర్పాటు చేయడం జరుగుతుంద‌ని చెప్పారు.

ఆ పార్కును తాను దత్తత తీసుకొని అందులోని మొక్కలను రక్షించే బాధ్యత తీసుకుంటాన‌ని చెప్పారు.

పార్కులో అవసరమైన వాకింగ్ ట్రాక్‌ను, పార్కు అభివృద్ధి కోసం కావలసిన ఏర్పాట్లను త‌న‌ సొంత డబ్బులతో చేయడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

త‌న‌ ఆహ్వానం మేరకు వచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి, మేయర్ బొంతు రాంమ్మోహన్ గారికి, ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి ఆయ‌న కృతజ్ఞతలు తెలియ‌జేశారు. 

నిర్మాత‌లు అనిల్ సుంకర (ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌) రామ్ ఆచంట, గోపి ఆచంట (14 రీల్స్ ప్ల‌స్‌) వంశీ, విక్కీ, ప్రమోద్ (యువి క్రియేషన్స్), సుధాకర్ చెరుకూరి (ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌)ల‌కు మొక్కలు నాటాలని శ‌ర్వానంద్‌ ఛాలెంజ్ ఇచ్చారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/