హైదరాబాద్ లో భారీ వర్షం
ఎల్బీనగర్ లో 10.2 సెంటీమీర్ల వర్షం
Hyderabad: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఎల్బీనగర్ లో ఏకంగా 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మరాట్వాడా నుంచి తెలంగాణ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తున ఆవరించివున్న ఉపరితల ద్రోణి కారణంగానే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లో రాత్రంతా కురిసిన భారీ వర్షం కారణంగా పలు చోట్ల . రహదారులపై రెండు అడుగుల ఎత్తున నీరు నిలిచింది. .
దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట నిమ్స్, అమీర్ పేట చౌరస్తా, మాదాపూర్, రామాంతపూర్, మెహిదీపట్నం, కూకట్ పల్లి తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తాతాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/