కోమటిచెరువులో బోటు నడిపిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట‌లోని కోమ‌టిచెరువులో బోటు నడిపి సందడి చేసారు మంత్రి హరీష్ రావు. కోమ‌టిచెరువులో భార్యాపిల్ల‌ల‌ను బోటు ఎక్కించుకుని స్వ‌యంగా బోటును న‌డుపుతూ హరీష్ రావు క‌నిపించారు. ఈ సంద‌ర్భంగా వారి బోటు అలా సాగుతుండ‌గా… ఓ తామ‌ర పువ్వు క‌నిపించ‌గానే… దానిని అందుకునేందుకు హ‌రీశ్ రావు స‌తీమ‌ణి య‌త్నించ‌గా… స్టీరింగ్ తిప్పుతూనే అలా వంగిన హ‌రీశ్ రావు ఆ పువ్వును అందుకుని త‌న భార్య చేతికి అందించి సంతోష పెట్టారు. దీనికి సంబదించిన వీడియోను హ‌రీశ్ రావు ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ (పీఏ) రాంచంద‌ర్ రావు ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు.