ధమాకా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ రాజా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ధమాకా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 15 న చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు.

వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు. ఇప్పటికే చిత్రంలోని పలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్న మేకర్స్..తాజాగా ఈనెల 15న ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.