పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జీవీఎల్

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా అభిమానులు , రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ట్విట్టర్ ద్వారా బెస్ట్ విషెష్ ను అందించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని తలపెట్టి, బీజేపీతో జతకట్టి, మార్పు కోసం ముందుకు వెళుతున్న జనసేన అధ్యక్షులు, పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ స్పందించారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు, మనకు విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తాను అంటూ జీవీఎల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక చంద్రబాబు..భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నారని తెలిపారు. ‘జనసేన’ అధ్యక్షుడు, సోదరుడు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

పవన్ ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమేనని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయతీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కల్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కల్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నయ్య చిరంజీవి ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ హీరోలు , చిత్రసీమ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున విషెష్ అందించారు.