ప్రభుత్వాన్ని తిడితే హెచ్ఆర్ఏ పెరుగుతుందా?: మంత్రి పేర్ని నాని

కమిటీ ఏర్పాటు విషయం నాకు తెలియదు: మంత్రి పేర్ని నాని

అమరావతి: ఏపీ ఉద్యోగులు మెరుగైన పీఆర్సీ కోరుతూ ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మె ప్రకటించడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఉద్యోగులు సమ్మెకు దిగుతున్న విషయం తమకు తెలియదని పేర్కొన్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ అంశం సర్కారు దృష్టికి రాలేదని తెలిపారు. అంతేకాదు, ఉద్యోగులతో సంప్రదింపులకు ప్రభుత్వం ఓ కమిటీ వేసిన విషయం కూడా తనకు తెలియదని పేర్ని నాని పేర్కొన్నారు.

ఉద్యోగులు సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని, ప్రభుత్వాన్ని తిడితే హెచ్ఆర్ఏ పెరుగుతుందా? అని ప్రశ్నించారు. న్యాయంగా పోరాడితేనే ఫలితం వస్తుందని అన్నారు. ఉద్యోగులు రోడ్లెక్కరాదనే ప్రభుత్వం కోరుకుంటోందని వెల్లడించారు. ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాలను పేర్ని నాని మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా స్పందించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/