‘గుంటూరు కారం’ నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుండి దమ్ మసాలా సాంగ్ వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా..హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకం పై నాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, జైరాం, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటె ఈరోజు సినిమాలోని దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు. ఇందులో ఎలాంటి వీడియో బైట్స్ చూపించకుండా కేవలం మోషన్ పోస్టర్ తోనే పాట రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

https://youtube.com/watch?v=5cwHwcSs9Iw%3Fsi%3DyjCiiI4SMxs-1aCq