మామ్ ఐవీఎఫ్ & రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఘనంగా వరల్డ్ ఐవీఎఫ్ డే వేడుకలు

హైదరాబాద్ : నమ్మకానికి, అత్యుత్తమ ఐవీఎఫ్ ట్రీట్ మెంట్ కు అసలైన చిరునామా మామ్ ఐవీఎఫ్ & రీసెర్చ్ సెంటర్. హైదరాబాద్ లో ప్రముఖ ఐవీఎఫ్ సెంటర్ గా ఇది సేవలందిస్తోంది. సంతానం లేక బాధపడుతున్న స్త్రీల మాతృత్వ స్వప్నాన్ని సాకారం చేస్తోంది. అలాంటి మామ్ ఐవీఎఫ్ & రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో వరల్డ్ ఐవీఎఫ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మెహదీపట్నంలోని మామ్ ఐవీఎఫ్ సెంటర్ లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. సంస్థ సీఈఓ, ఫౌండర్ డాక్టర్ హరికాంత్ చారి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణిమ దుర్గ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

పిల్లలు లేని దంపతులకు ఆరోగ్యకరమైన డైట్ తో పాటు సంతాన సాఫల్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని డాక్టర్ హరికాంత్ చారి, డాక్టర్ పూర్ణిమ దుర్గ తెలిపారు. పీసీఓడీ, అండాల్లో లోపాలు, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి, ధూమపానం ఇలాంటివన్నీ సంతాన లేమికి కారణాలని వివరించారు. సరైన డైట్, వ్యాయామంతో పాటు పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని సూచించారు.

ఐవీఎఫ్ పై ఎలాంటి అపోహలు, భయాలు పెట్టుకోవద్దని డాక్టర్ పూర్ణిమ దుర్గ తెలిపారు. బెస్ట్ సక్సెస్ రేట్ తో తాము ట్రీట్ మెంట్ ఇస్తున్నామని వెల్లడించారు. పిల్లలు లేని దంపతులు మామ్ ఐవీఎఫ్ & రీసెర్చ్ సెంటర్ ను సంప్రదించి తల్లిదండ్రులు కావాలన్న వారి కలను నిజం చేసుకోవాలని కోరారు.