సొంత పార్టీ నేతలే నా వెనుక గొయ్యి తవ్వుతున్నారుః రాజాసింగ్

ఎన్నికల తర్వాత వీరి అంతు చూస్తానని హెచ్చరిక

rajasingh

హైదరాబాద్‌ః బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్న రాజాసింగ్… తన సొంత పార్టీ నేతలపైనే నిప్పులు చెరిగారు. కొన్ని రోజులుగా సొంత పార్టీ నేతలే తన వెనుక గొయ్యి తవ్వుతున్నారని మండిపడ్డారు. తన వ్యూహాలను సొంత మనుషులే ప్రత్యర్థులకు చేరవేస్తున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత వీరి అంతు చూస్తానని అన్నారు. 2018లో తనను ఓడించేందుకు యత్నించిన వారి జాబితా తన వద్ద ఉందని… ప్రత్యర్థులతో ఎవరెవరు టచ్ లో ఉన్నారనే విషయం తనకు తెలుసని చెప్పారు. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.