స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ ఎగుమతికి కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ : భారతదేశంలో తయారవుతున్న రష్యన్ స్పుత్నిక్ లైట్ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. స్పుత్నిక్‌ లైట్‌ వ్యాక్సిన్‌ను భారతదేశంలో అత్యవసర వినియోగానికి ఇంకా ఆమోదించలేదు. దాంతో ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం ఆదివారం అనుమతి ఇచ్చింది. రష్యాకు 40 లక్షల డోసుల స్పుత్నిక్ లైట్‌ను ఎగుమతి చేయడానికి భారత్‌కు చెందిన ఔషధ సంస్థ హెటెరో బయోఫార్మా లిమిటెడ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

స్పుత్నిక్ లైట్ అనేది రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ V కాంపోనెంట్-1 వలె ఉంటుంది. ఇది ఏప్రిల్‌లో భారతదేశం ఔషధ నియంత్రణ విభాగం నుంచి అత్యవసర వినియోగ అధికారాన్ని పొందింది. దాంతో భారతదేశంలోని యాంటీ-కోవిడ్ టీకాల్లో ఈ టీకాను కూడా చేర్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/