హనుమంతరావును పరామర్శించిన గవర్నర్‌ దత్తాత్రేయ

హైదరాబాద్ : హర్యాన గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావును పరామర్శించారు. అంబర్‌పేటలోని హనుమంతరావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాగా, కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా చికిత్స పొందిన హనుమంతరావు ఇటీవలనే హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జయ్యారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/