డ్రగ్స్ కేసు : డైరెక్టర్ పూరి, రవితేజలకి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన ఫోరెన్సిక్ లేబొరేటరీ

Director Puri Jaganath
Director Puri Jaganath

డ్రగ్స్ కొనుగోళ్లు… మనీ లాండరింగ్ కేసులో భాగంగా పలువురు సినీ ప్రముఖులను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ పూరి , ఛార్మి , నందు , రవితేజ , రానా , తనీష్ , నవదీప్ , రకుల్ , ముమైత్ తో పాటు కెల్విన్ లను అధికారులు విచారించి పలు వివరాలు , బ్యాంకు స్టేట్మెంట్లను తీసుకున్నారు.

ఇదిలా ఉంటె తాజాగా ఫోరెన్సిక్ లేబొరేటరీ పూరి జగన్నాథ్ తో పాటు చార్మి, నవదీప్, రవితేజ, సుబ్బరాజు, తరుణ్ ,నందు, తనీష్, రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ లతో పాటు ఆరుగురికి క్లీన్ చిట్ ఇచ్చింది. సినీ ప్రముఖులు ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని తేల్చింది ఫోరెన్సిక్ ల్యాబ్. విచారణ సమయంలో 16 మంది దగ్గర నుంచి చేతి వేళ్ళ గోర్లు వెంట్రుకలు రక్తనమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ పంపిన ఎక్సైజ్ అధికారులు.

ఇక పూరి సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఛార్మి , కరణ్ జోహార్ లు సంయుక్తంగా ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవా లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.