ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్
హోమ్‌లోన్ తీసుకునే వారికి ఇదే సరైన సమయం

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. బ్యాంకులో హోమ్‌లోన్ తీసుకోవాలని భావించే వారికి ఇదే సరైన సమయం అని తెలిపింది. బ్యాంక్ హోమ్ లోన్‌పై వడ్డీ రేట్లను 25 బేసిన్ పాయింట్ల మేర తగ్గించింది. స్టేట్ బ్యాంకు తగ్గింపు నిర్ణయంతో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు 8.15శాతం నుంచి 7.9 శాతానికి దిగొచ్చింది. ఈ కొత్త రేట్లు జనవరి 1నుంచి అమలులోకి వచ్చాయి. ఎస్‌బీఐ సహా పలు ఇతర బ్యాంకులు వాటి హోమ్ లోన్స్, ఇతర రిటైల్ రుణాలను ఎక్స్‌టర్నల్ రేట్లతో అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేటుతో అనుంసధానమైన హోమ్ వడ్డీ రేట్లు దిగిరానున్నాయి. అలాగే ఎంఎస్‌ంఈ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. బ్యాంక్ లెండింగ్ వ్యాపారాన్ని పుంజుకునేలా చయడానికి ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగానికి జోష్ ఇవ్వాలనే లక్ష్యంతో వడ్డీ రేట్లను తగ్గించింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/