‘ఫ్యూచర్స్‌’లో పసిడి పరుగులు

రోజురోజుకూ పెరుగుతున్న ధరలు

Gold-Silver
Gold-Silver

న్యూఢిల్లీ,: బంగారం, వెండి ధరలు గురువారం జూన్‌ 11న పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్ఛేంజ్‌ (ఎంసిఎక్స్‌)లో జూన్‌ గోల్డ్‌ కాంట్రాక్ట్‌ 10 గ్రాములకు 1.1శాతంపెరిగి రూ.47,173 పలికింది. జులై ఫ్యూచర్స్‌ సిల్వర్‌ 1.9శాతం పెరిగి కిలో రూ.49,018 పలికింది.

బంగారం రూ.47వేల నుంచి 47,200 మధ్య పలికితే ఆ తర్వాత రూ.47,500 నుంచి రూ.48వేలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగానే భావించాలని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

ఎంసిఎక్స్‌లో ఆగస్టు గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాములకు ఏకంగా రూ.550 పెరిగి రూ.47,160కి అటుఇటుగా ఉంది. జులై సిల్వర్‌ ఫ్యూచర్స్‌ రూ.950కి పైగా పెరిగి రూ.49018 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలుతగ్గాయి. స్పాట్‌ గోల్డ్‌ 0.2శాతం తగ్గి ఔన్స్‌ 1,732.56 డాలర్లు పలికింది. అంతకుముందు జూన్‌ 2వ తేదీన రికార్డు ధర పలికింది.

ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వివిధ ఆర్థిక సంస్థలు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రెండోసారి పుంజుకుంటే ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని చెబుతున్నారు. కరోనా రెండోసారి విజృంభించకుంటే మాత్రం వచ్చే ఏడాదికి ఆర్థికవ్యవస్థలుకోలుకుంటాయని వెల్లడించాయి.

మరోవైపు కరోనా రెండోసారి పుంజుకునే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపుతున్నారు. మన దేశంలోను కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఇటీవల వరకు బంగారం ధరలు తగ్గి,ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలపై ఆందోళన పరిస్థితులు కనిపించడంతో తిరిగి పెరుగుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/