కాస్తంత తగ్గిన బంగారం ధరలు

రూ. 830 తగ్గిన కిలో వెండి

Gold
Gold

ఢిల్లీ: మిడిల్‌ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అమాంతం పెరిగిన బంగారం నేడ కాస్త తగ్గుముఖం పట్టింది. న్యూఢిల్లీలో నేడు రూ. 420 తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 41,210 గా ఉంది. వెండి రూ. 830 తగ్గి ఒక కిలో ధర రూ.48,600 గా ఉంది. రూపాయి మారకం విలువ కాస్త బలపడటంతో అంతర్జాతీయంగా బంగారం ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణ జరగడంతో దేశీయంగా లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర రూ. 1,568 డాలర్లు, ఔన్సు వెండి ధర రూ. 18.19 డాలర్లకు దిగొచ్చింది. అయితే పండుగ, పెళ్లిళ్ల సీజన్‌ మొదలవనుండడంతో పసిడి విక్రయాలు పెరగొచ్చని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతయంగా అనిశ్చితి గనుక నెలకొంటే మళ్లీ బంగారం ధరలు పెరుగే అవకాశం ఉన్నట్లు మార్కెటు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/