పోలీసులు నా బైక్ ఇవ్వకుంటే పైనుంచి దూకుతా …

ఫ్లైఓవర్ ఎక్కి యువకుడు హల్చల్

Give me my bike: young man climbed the flyover
Give me my bike: young man climbed the flyover

Hyderabad: నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఎక్కి ఓ యువకుడు హంగామా సృష్టించాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఈ సంఘటన జరిగింది. వివరాలు ఎలా ఉన్నాయి. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆ యువకుడు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు.

అప్పటి నుంచి తన బైక్ తనకి ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పు కుంటున్నారని దీంతో మనస్దాపం చెంది ఫ్లై ఓవర్ ఎక్కాడు. తన బైక్ తనకు ఇవ్వకపోతే పై నుంచి దూకుతానని బెదిరించాడు. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆ యువకుడిని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/