కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన గులాంనబీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుస పెట్టి నేతలు పార్టీకి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ కి రాజీనామా చేయగా..ఈరోజు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాహుల్‌ గాంధీ సీనియర్ల అందరినీ పక్కన పెట్టేశారని తన రాజీనామా సందర్భంగా గులాం నబీ అజాద్‌ పేర్కొన్నారు.

రాహుల్‌ గాంధీకి రాజకీయ పరిపక్వత లేదని విమర్శలు చేశారు. రాహు ల్‌ వైఎస్‌ ప్రెసి డెంట్‌ అయ్యాక.. కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా నాశనం అయిందని ధ్వజమెత్తారు. కాగా జమ్మూ కాశ్మీర్‌ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో.. గులాం నబీ ఆజాద్‌… రాజీనామా మాత్రం కాంగ్రెస్‌ పార్టీ కి పెద్ద షాక్‌ అని చెప్పాల్సి ఉంటుంది. గతంలో రాజ్యసభ విపక్ష నేతగా, కేంద్రమంత్రిగా గులాంనబీ ఆజాద్ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఆయన ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు.2005-2008 వరకు జమ్ముకశ్వీర్ ముఖ్యమంత్రిగా గులాంనబీ ఆజాద్ పనిచేశారు.