ఐరాస మాజీ చీఫ్‌ కన్నుమూత

శాంతి స్థాపనకు ఎంతగానో కృషి చేసిన జేవియర్‌ పరెజ్‌ డి సెల్యులార్‌

Former UN chief Javier Perez de Cuellar
Former UN chief Javier Perez de Cuellar

లిమా: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్‌ పరెజ్‌ డి సెల్యులార్‌ పెరూలో కన్ను మూశారు. ఆయన వయసు వంద సంవత్సరాలు. 1981 నుండి 1991 వరకు దశాబ్ద కాలం పాటు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ కాలంలో ప్రపంచ ఆకలిపై పోరాటం, ఇరాన్‌, ఇరాక్‌ మధ్య ఎనిమిదేళ్లుగా సాగిన యుద్ధానికి తెరదించడం, ఎల్‌ సాల్వడార్‌లో అమెరికా ఎగదోసిన అంతర్యుద్ధానికి ముగింపు పలికి శాంతిని నెలకొల్పడం వంటి చర్యలు ఆయన పాలనాదక్షతకు నిదర్శనం. 1990లో నమీబియా స్వాతంత్ర సముపార్జనను తన గొప్ప విజయంగా ఆయన భావిస్తారు. 1973 నుండి 74 వరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడుగా ఆయన వ్యవహరించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/