స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం

వైఎస్‌ఆర్‌సిపి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తాం

botsa satyanarayana
botsa satyanarayana

అనంతపరం: వైఎస్‌ఆర్‌సిపి పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. అనంతపురం పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి గెలుపు కోసం గత ఎన్నికల్లో కష్టించి పనిచేసిన వారినే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబెట్టాలని పార్టీ శ్రేణులకు బొత్స సూచించారు. ఇంకా పార్టీలకు అతీతంగా అందరికీ ఉగాది సందర్భంగా ఇంటి స్థలాలను ఇస్తామని బొత్స చెప్పారు. అర్హులైన అందరికీ ఇప్పటికే పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను ఇవ్వడం ఒక చరిత్ర అని బొత్స అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయకూడదని ముఖ్యమంత్రి చట్టం చేశారని..ఈ మేరకు గ్రామవాలంటీర్లకు స్పస్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగిందని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/