కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే వెంక‌ట కృష్ణారావు మృతి

Former TDP MLA Pendyala Venkata Krishna Rao Passes

అమరావతిః ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం నాడు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా, కృష్ణారావు టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.