పూనమ్ స్పిన్ కు ఆస్ట్రేలియా కంగారు..

poonam

సిడ్ని: మహిళా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను భారత్ కంగు తినిపించింది.. సిడ్నీలో నేటి నుంచి ఆరంభమైన ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లో భారత్ కంగారులపై   పరుగుల తేడాతో విజయం సాధించింది..

భారత తన 20 ఓవర్లో నాలుగు వికెట్లకు 132 పరుగులు చేసింది..133 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన అసీస్ 19.5 ఓవర్లలో 115  పరుగులకు కుప్పకూలింది.. భారత్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అద్బుతమైన గుగ్లీస్ తో నాలుగు వికెట్లు పడగొట్టి కంగారుల భరతం పట్టింది. ఆస్ర్టేలియా బ్యాటింగ్ లో హీలీ 51 పరుగులు, గార్డెనర్  34 పరుగులు చేశారు… మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్స్ కే పరిమితమయ్యారు..

బౌలింగ్ లో పూనమ్ 19 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టగా, శిఖ పాండే 13  పరుగులు 3 వికెట్లు   గైక్వాడ్ 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది… ఇక భారత్ బ్యాటింగ్ లో ఓపెనర్ షఫాలి 29, రోడ్రిగ్స్ 26, తానియా శర్మ 49 (నాటాట్) పరుగులు చేశారు… పూనమ్ యాదవ్ కి ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది..

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/