హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ అపార్ట్ మెంట్ అగ్ని ప్రమాదం

Rakul Future Projects
Rakul Future Projects

హీరోయిన్ రకుల్ ప్రీతీ సింగ్ అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలో ఆమె నివాసముంటున్న బిల్డింగ్ 12 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అగ్నీ ప్రమాదం స‌మయంలో హీరోయిన్ రకుల్ షూటింగ్ త‌న నివాసం లేదు. షూటింగ్ కోసం ఇత‌ర ప్రాంతంలో ఉంది. ఈ విష‌యం తెలిసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మంటలు ఎలా వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రీసెంట్ గా తెలుగు లో కొండ పొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చక్కటి విజయం అందుకుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా క్రిష్ డైరెక్టర్.