సంగారెడ్డిలో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని పరిశ్రమలో ఈరోజు మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ కెమిక‌ల్ కంపెనీలో మంట‌లు ఎగిసిప‌డ్డాయి. ప‌రిశ్ర‌మ‌లోని కెమిక‌ల్ డ్ర‌మ్ములు పేలిపోయాయి.భారీ శ‌బ్దాల‌తో కెమిక‌ల్ డ్ర‌మ్ములు పేలిపోవ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. కంపెనీలో ప‌ని చేసే సిబ్బంది భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో స్థానికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మంట‌ల‌ను ఆర్పేందుకు అగ్నిమాప‌క సిబ్బంది య‌త్నిస్తోంది. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/