రాజేంద్రనగర్‌ లో దారుణం..కూతురి ఫై తండ్రి లైంగిక దాడి

రాజేంద్రనగర్‌ లో దారుణం..కూతురి ఫై తండ్రి లైంగిక దాడి

సమాజంలో కామంతో కళ్లు మూసుకుపోయి వావివరుసలు మరచిపోతున్నారు. కన్న బిడ్డలపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతూ తలెత్తుకోకుండా చేస్తున్నారు. పది రోజుల క్రితం సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటన మరువకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే వావి వరుసలు మరిచి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన రాజేంద్రనగర్‌ పరిధిలో చోటుచేసుకుంది.

రాజేంద్రనగర్‌‌కు చెందిన ఓ వ్యక్తి భార్య, కూతురి(మైనర్ బాలిక)తో నివాసం ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడి భార్య అనారోగ్యంతో చనిపోయింది. భార్య లేకపోవడంతో అతడి కన్ను కూతురిపై పడింది. 15 రోజులుగా బాలికను బెదిరించి నిత్యం లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. కాగా బుధవారం ఇంటి ముందు కూర్చుని ఆ బాలిక ఏడుస్తూ ఉంది. బాలిక ను చూసిన స్థానికులు ఏం జరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో వారు తండ్రిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.