వివాదం లో పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి

చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు గడవకముందే..ఆయన్ను వివాదం చుట్టుముట్టింది. తాజాగా చరణ్‌జిత్ సింగ్ చార్టెడ్ ఫ్లయిట్‌లో ప్రయాణించడం వివాదస్పదంగా మారింది.

కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూతోపాటు మరో ఇద్దరితో కలసి సీఎం చన్నీ ఢిల్లీకి వెళ్లారు. అయితే సాధారణ ఫ్లయిట్‌లోనో లేదా కార్‌లోనో వెళ్లకుండా ఖరీదైన ప్రైవేట్ జెట్‌లో ఎందుకు వెళ్లారంటూ చన్నీపై విపక్షాలు మండిపడుతున్నాయి. చండీగఢ్ నుంచి ఢిల్లీకి 250 కిలో మీటర్ల దూరం. అంత తక్కువ దూరం జర్నీకి మామూలు ఫ్లయిట్ లేదా కార్లను వాడాల్సింది. కానీ చార్టెడ్ ఫ్లయిట్‌ వాడడం ఫై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వద్ద అధికారికంగా 5 సీటర్ చాపర్ అందుబాటులో ఉన్నా.. దాన్ని ఎందుకు వాడటం లేదని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు.