చైతు – సమంత లు విడిపోవద్దు అంటూ ఫ్యాన్స్ కన్నీరు

నాగ చైతన్య – సమంత లు విడిపోతున్నారంటూ గత కొద్దీ రోజులుగా మీడియా లో తెగ ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల ఫై ఇంతవరకు సమంత కానీ అక్కినేని ఫ్యామిలీ కానీ స్పందించకపోయేసరికి అంత కూడా విడిపోతున్నారని ఫిక్స్ అయ్యారు. తాజాగా ఈ వార్తల ఫై ఓ అభిమాని కన్నీరు పెట్టుకుంటూ చైతు – సమంత లు విడిపోవద్దు తన ఆవేదన వ్యక్తం చేసాడు.

నాగ చైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ ” సినిమా భారీ అంచనాలతో ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో అభిమానులు , చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటె ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క అభిమాని… నాగచైతన్య మరియు సమంత లవ్ స్టోరీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద నాగచైతన్య ఫ్యాన్ లవ్ స్టోరీ మూవీ చూసిన అనంతరం భావోద్వేగానికి గురయ్యారు. లవ్ స్టోరీ సినిమా చాలా బాగుందని కింగ్ నాగార్జున కొడుకు గా నాగచైతన్య మరోసారి నిరూపించుకున్నాడు అని పేర్కొన్నాడు.

ఇలాంటి ప్రేమ కథ చిత్రం ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చేయలేదని శేఖర్ కమ్ముల కొనియాడారు. అలాగే ఈ లవ్ స్టోరీ సినిమా ను సమంత చూడాలని సూచించాడు. అంతేకాదు… దయచేసి నాగచైతన్య – సమంత ఇద్దరూవిడిపోవద్దని , ఇద్దరు కలిసే ఉండాలని కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

https://youtube.com/watch?v=hOvflr1OM-M