ప్రశాత్‌ భూషణ్‌కు రూ.1 జరిమానా విధించిన సుప్రీంకోర్టు

సెప్టెంబరు 15లోగా జరిమానాను కట్టాలని ఆదేశం

విఫలమైతే మూడేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేయొద్దు

ప్రశాత్‌ భూషణ్‌కు రూ.1 జరిమానా విధించిన సుప్రీంకోర్టు
Supreme Court – Prashant Bhushan

న్యూఢిల్లీ: ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు కోర్టు ధిక్కరణ కేసులో శిక్ష ఖరారైంది. న్యాయస్థానం ఒక రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబరు 15లోగా ఈ జరిమానాను కట్టాలని సుప్రీంకోర్టు ఆయనను ఆదేశించింది. ఒక్కవేళ ఆ సమయంలోపు రూ.1 జరిమానా కట్టడంలో విఫలమైతే మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని లేక మూడేళ్ల పాటు న్యాయవాదిగా పనిచేయొద్దని, ఈ మేరకు నిషేధం విధిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. కాగా, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడంపై ప్రశాంత్ భూషణ్ తిరస్కరించారు.

కాగా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు, కొన్ని రోజుల క్రితం సీజే బోబ్డే ఖరీదైన బైక్‌ పై హెల్మెట్, మాస్క్ లేకుండా కనిపించారని ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ధిక్కారానికి పాల్పాడ్డారంటూ సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపింది. ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీలతో కూడి త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింది. తనకు రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకుని అభిప్రాయాలను వ్యక్తం చేశానని ప్రశాంత్ భూషణ్ చెప్పుకొచ్చారు. అయితే, ఆయన ఇచ్చిన వివరణపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/