రంగారెడ్డి జిల్లాలో విషాదం: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధతో కుటుంబం మొత్తం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిభట్ల పరిధిలోని కూర్మల్​గూడలో జరిగింది. నగరానికి చెందిన ఈ కుటుంబం అప్పుల బాధ తాళలేక ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

గత రాత్రి పురుగుల మందుతాగి చెరువులో దూకినట్లు తెలుస్తుంది. చెరువులో తండ్రి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలు తేలాయి. మహిళ మృతదేహం కోసం స్థానికులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు కుద్దుస్ పాషా (37), ఫాతిమా (28), మెహర్ (9), ఫిర్దోషు భేగం(6)గా గుర్తించారు. వీరి కుటుంబం హైదరాబాద్​లోని సంతోశ్​నగర్​లో ఉంటున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న డీఆర్​ఎఫ్, పోలీసు బృందాలు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కుద్దుస్ పాషా ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన కుద్దుస్ పాషా తన బామ్మర్ది హమీద్​ను రాత్రి పదివేల రూపాయలు అడిగాడని చెపుతున్నారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.