లాక్ డౌన్ పేరిట నకిలీ జీవో : యువకుడు అరెస్ట్
తప్పుడు ప్రచారాలు, షేర్ చేసినా కఠిన చర్యలు: హైదరాబాద్ సిపి హెచ్చరిక

Hyderabad: ప్రభుత్వం గతంలో ప్రకటించిన తరహాలో రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు నకిలీ జీవోను రూపొందించి వైరల్ చేసిన యువకుడు పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయ్యాడు. శ్రీపతి సంజీవ్ కుమార్ ఈ నకిలీ జీవోను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడారు.
నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని , అతడి స్వస్థలం నెల్లూరు అని, ఓ ప్రైవేటు సంస్థలో ఛార్టెడ్ అకౌంటెంట్‌గా ఇక్కడ పని చేస్తున్నాడని తెలిపారు.
తెలంగాణలో గత ఏడాది లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ఇచ్చిన జీవోను డౌన్లోడ్ చేసి అందులో మార్పులు చేసి కొత్త జీవోగా దాన్ని సృష్టించాడని సిపే తెలిపారు. ఇలా తప్పుడు ప్రచారాలను షేర్ చేయొద్దని, నిజాన్ని నిర్ధారించుకోకుండా షేర్ చేసిన వారిపైనా కూడా కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/